2023 వన్డే ప్రపంచ కప్ (2023 ODI World Cup): ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఓవల్ గ్రౌండులో జూన్ 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో భారత జట్టు పైన ఆస్ట్రేలియా జటట్టు అత్యుత్తమ విజయాన్ని సాధించింది. ఫైనల్లో ఓటమి పాలైన తర్వాత, భారత జట్టులో ఆటగాళ్లు బాగా ఆడలేదని, అందుకే ఓటమి చెందామని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ముఖ్యమైన భారత ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. సంవత్సరం మొత్తం క్రికెట్ ఆడితే ఆటగాళ్లు చాలా అలిసిపోతున్నారు. ముఖ్యంగా ఐపిఎల్ వంటి లీగ్ మ్యాచుల్లో ముఖ్యమైన టీమిండియా ప్లేయర్లను కేవలం 5 మ్యాచ్స్ మాత్రమే ఆడేలా నియమ నిబంధనలు రూపొందించాలని బిసిసిఐ బోర్డుకు కూడా కొందరు సూచనలు చేస్తున్నారు. వరుసగా రెండు నెలలు ఐపిఎల్ ఆడటం, ఐపిఎల్ మరియు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మధ్య కేవలం వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండటం వల్ల భారత క్రికెటర్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయడం లేదన్నది నమ్మదగిన వాస్తవం.
2023 వన్డే ప్రపంచ కప్: పదేళ్లుగా గెలవని ICC ట్రోఫీ
ఇండియా జట్టు చివరగా 2013లో ఇంగ్లండ్ దేశంలో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ మీద గెలిచి ఐసిసి ట్రోఫీ గెల్చుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ దశాబ్ద కాలం అవుతున్నా.. ఒక్క ఐసిసి ట్రోఫీ కూడా గెలవలేదు. దాదాపు ప్రతి ఐసిసి టోర్నమెంట్స్ అయిన వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా అన్నింట్లో సెమీ ఫైనల్ లేదా ఫైనల్ వరకూ వచ్చి బోల్తా కొడుతున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో కూడా ఆస్ట్రేలియా మీద ఓటమి పాలైంది. ఉత్తమ జట్టుగా, టెస్టుల్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు సరైన ప్రాక్టీస్, వ్యూహాలు లేక కంగారూల చేతిలో చావు దెబ్బ తిన్నది.
2023 వన్డే ప్రపంచ కప్: గేమ్ ప్లాన్ మారుస్తామన్న రోహిత్ శర్మ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులో ఆసీస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా ముందు మాట్లాడాడు. ఇప్పుడు జట్టును కొత్తగా తయాచు చేయాల్సిన అవసరం ఉందని, దీని కోసం తగిన మార్పులు చేస్తామని తెలిపాడు. 2023 అక్టోబరు, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో విభిన్నంగా ఆడతామని, గేమ్ ప్లాన్ మొత్తం మారుస్తామని పేర్కొన్నాడు. మా ఆట విధానం చాలా స్పష్టంగా, ప్రతి మ్యాచ్ గెలిచే విధంగా ఉంటుందని, ఇకపై జట్టులో ఎలాంటి గొడవలు కూడా ఉండవని, కలిసికట్టుగా విజయాలు సాధిస్తామని అన్నాడు.
2023 వన్డే ప్రపంచ కప్: నిరంతరం ఆడుతున్న క్రికెటర్స్
భారత జట్టు క్రికెటర్స్ నిరంతరం మ్యాచ్స్, సిరీస్‌లు ఆడటం కూడా ఐసిసి టోర్నమెంట్లలో ఓడిపోవడానికి ముఖ్య కారణంగా ఉంది. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీ దాదాపు 2 నెలల పాటు జరుగుతుంది. అలాగే దానికి నెల రోజుల ముందే ప్రాక్టీస్ మొదలవుతుంది. ఐపిఎల్ పూర్తైన తర్వాత క్రికెటర్స్‌కు కొంత విశ్రాంతి ఉండాలి. కేవలం వారం రోజుల తర్వాత మాత్రమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం వల్ల కూడా ప్లేయర్స్ సరిగా ఆడలేకపోయారు. దీని కారణంగా ముఖ్యమైన WTC ఫైనల్ మ్యాచులో భారత క్రికెటర్స్ చేతులెత్తేశారు.
2023 వన్డే ప్రపంచ కప్: ముఖ్య క్రికెటర్లకు ఐపిఎల్ నుంచి నిష్క్రమణ
దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ మ్యాచ్స్ జరుగుతాయి. అలాగే ఒక నెల ప్రాక్టీస్ మ్యాచ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది ఒక దేశీయ లీగ్ మాత్రమే అని క్రికెటర్స్ గుర్తుంచుకోవాలి. కేవలం డబ్బు కోసం మాత్రమే ఆడకుండా, దేశం కోసం ఆడాలంటే ఐపిఎల్ వంటి టోర్నమెంట్ల పైనా ఎక్కువ దృష్టి పెట్టకుండా క్రికెటర్స్ చూడాలి. దీనికి బిసిసిఐ కూడా క్రికెటర్లకు తగిన నియమాలు మరియు నిబంధనలు ఏర్పాటు చేయాలి. అప్పుడే, ముఖ్య భారత క్రికెటర్స్ ఐసిసి టోర్నమెంట్లలో బాగా రాణివచగలరు.
భారత జట్టులో ఉన్న దాదాపు 20 మంది క్రికెటర్స్ కేవలం 5 లేదా 7 ఐపిఎల్ మ్యాచ్స్ మాత్రమే ఆడే నిబంధన ఉండాలి. లేకపోతే, ఆర్థిక వనరుగా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద కూడా అభిమానలు విరుచుకుపడే అవకాశం ఖచ్చితంగా ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొన్నారు.
చివరగా, 2023 వన్డే ప్రపంచ కప్ (2023 ODI World Cup) సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. అలాగే, మిగిలిన గేమ్స్ గురించి వివరాల కొరకు ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) చూడండి. మీరు వివిధ ఆటలు ఆడాలనుకుంటే Yolo247 (యోలో247) సైట్ ఉత్తమమైనది.