ఐపిఎల్ కొత్త నియమాలు 2023 : నోబాల్, వైడ్ బాల్ రివ్యూ, ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలు

ఐపిఎల్ కొత్త నియమాలు 2023 (IPL new rules 2023) : ఐపిఎల్ సీజన్ మొదలైంది. మార్చి 31 నుండి మొదలైన 16వ సీజన్ 2 నెలల వరకూ క్రికెట్ ఫ్యాన్స్‌‌ను చాలా ఖుషీ చేయనుంది. 2022 సీజన్ లాగే ఈ ఐపిఎల్ సీజన్‌లో కూడా 10 టీమ్స్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఐతే, ఈ సారి IPL సీజన్లో చాలా కొత్త నియమాలు వచ్చాయి. నోబాల్, వైడ్ బాల్ మీద రివ్యూలు, టాస్ వేసిన తర్వాత తుది 11 ప్లేయర్స్ వివరాలు అందించడం, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంచుకోవడం, పవర్ ప్లే టైంలో ఫీల్డింగ్ నియమాలు.. ఇలా అనేక కొత్త మార్పులు తీసుకొచ్చారు.

IPL కొత్త నియమాలు 2023 : నోబాల్, వైడ్ బాల్ కొరకు సమీక్షలు

 ఇప్పటికీ IPLలో బ్యాటర్ అవుటయితే మాత్రమే సమీక్ష(రివ్యూ) ఉండేది. ఈ ఐపిఎల్ నుండి మాత్రం నోబాల్, వైడ్ బాల్ సంబంధించిన సమీక్షలను కూడా చేయొచ్చు. దీన్ని మహిళల IPLలో ప్రవేశపెడితే మంచి ఫలితాలను ఇచ్చింది. అదే విధంగా, నోబాల్, వైడ్ బాల్ సంబంధించినవి ఒక్కో సారి తప్పుడ కూడా అయ్యాయి. నోబాల్, వైడ్ బాల్ సంబంధించి తప్పు నిర్ణయాలను ఎంపైర్లు ఇవ్వడం వల్ల గెలవాల్సిన టీమ్స్ కూడా ఓడిపోయాయి. కాబట్టి, నోబాల్, వైడ్ బాల్ మీద సమీక్షలు కోరడం రెండు టీమ్స్‌కు మంచి చేకూరుతుంది

IPL కొత్త నియమాలు 2023 : టాస్ తర్వాతే తుది టీం ఎన్నుకోవడం

ఐపిఎల్ మొదలైనప్పటి నుంచి 15 సీజన్స్ జరగ్గా, టాస్ వేసే ముందు మాత్రమే తుది ప్లేయర్లతో కూడిన 11 మంది జాబితాను, 4గురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను ప్రకటించడం ఆనవాయితీగా వచ్చేది. ఈ సీజన్లో అయితే, టాస్ వేసిన తర్వాతే తుది 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ఛాన్స్‌ను ఫ్రాంచైజీలకు కల్పించింది. ఇది ఇద్దరు టీమ్స్‌కు కూడా చాలా మంచి చేకూర్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వేళ ఏదైనా జట్టు టాస్ గెలిస్తే పిచ్ స్వభావం బ్యాట్స్‌మెన్లు లేదా బౌలర్ల అనుకూలతను బట్టి ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే మరొక జట్టు కూడా టాస్ ఓడిపోతే, పిచ్ యొక్క తీరును బట్టే ప్లేయర్స్‌ను ఎంచుకుంటుంది.

IPL కొత్త నియమాలు 2023 : గ్రూప్ మ్యాచ్‌ల్లో సమూల మార్పులు

గత సీజన్ నుండి IPLలో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. మొత్తం పది జట్లను 2 గ్రూపులుగా చేశారు. ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ఈ జట్లకు సంబంధించిన ర్యాంకులను అంతకు ముందు IPL సీజన్ ఆధారంగా ఇస్తారు. గత సీజన్ వరకూ గ్రూపు మ్యాచులు ఎలా ఉండేవంటే.. లీగ్ స్టేజీలో ఒక టీం.. తన గ్రూప్‌లో ఉన్న మిగిలిన 4 జట్లతో, మరొక గ్రూప్‌లోని సమాన ర్యాంక్ కల్గిన మరొక టీంతో కలిగిన రెండు మ్యాచుల చొప్పున ఆడేది. మిగిలిన నాలుగు టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడేది. మొత్తం ఒక టీం 14 మ్యాచులను ప్లే ఆఫ్స్ ముందు వరకూ ఆడటం సాధారణం. అలాగే ఇప్పుడు కూడా14 మ్యాచ్స్ ఆడుతుంది. అయితే, ఈ సీజన్ నుంచి మరొక గ్రూప్‌లోని 5 టీమ్స్‌తో రెండు చొప్పున మ్యాచులు, తన గ్రూప్‌లో ఉన్న మిగిలిన 4 టీమ్స్‌తో ఒక్కొక మ్యాచ్ ఆడుతుంది. 

ఉదాహరణకు గ్రూప్ A లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, గ్రూపు B లో ఉన్న 5 టీమ్స్ అయిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో రెండు చొప్పున మొత్తం 10 మ్యాచులు ఆడనుంది. అలాగే, గ్రూపు Aలో ఉన్న 4 జట్లైన లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున 4 మ్యాచులు ఆడనుంది.

IPL కొత్త నియమాలు 2023 : 5 రన్స్ పెనాల్టీ

బౌలర్ బంతి వేసిన సమయంలో ఫీల్డర్లు, వికెట్ కీపర్ కావాలని కదిలితే, ఫీల్డింగ్ చేసే టీంకు 5 రన్స్ పెనాల్టీ పడుతుంది. అలాగే, ఆ బంతిని కూడా డెడ్ బాల్‌గా నిర్ణయిస్తారు. నిర్ణీత సమయంలో 20 ఓవర్స్ పూర్తి చేయకుంటే, సర్కిల్ బయట 5గురు ప్లేయర్స్ బదులు నలుగురు ఆటగాళ్లను ప్లేయర్స్ మాత్రమే ఉండాలనే నిబంధన కూడా బిసిసిఐ తీసుకొచ్చింది.

IPL కొత్త నియమాలు 2023 : ఇంపాక్ట్ ఆటగాడి వివరాలు

ఈ సారి IPL సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చాలా చర్చిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల గేమ్ దశ మారుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, ఎవరినొ ఇంపాక్ట్ ప్లేయర్ అంటారో ఇప్పుడు చూద్దాం. మ్యాచ్‌కు ముందు ప్రతి టీం తుది 11 మంది ఆటగాళ్లను, అలాగే 4గురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ 4గురు సబ్ స్టిట్యూట్ ప్లేయర్ల నుంచే ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులో ఆడిస్తారు. ఇతడినే ఇంపాక్ట్ ఆటగాడు అంటారు. అయితే, 11 ఆటగాళ్లు ఉన్న తుది జట్టులో ఫారెన్ ఆటగాళ్లు 4గురు ఉంటే, అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇండియన్ ప్లేయర్‌ను ఎంచుకోవాలి. ఒక వేళ తుది టీంలో విదేశీ ప్లేయర్స్ ముగ్గురు ఉన్నప్పుడు, అప్పుడు ఇంపాక్ట్ ఆటగాడిగా విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు.

IPL కొత్త నియమాలు 2023 : ఇంపాక్ట్ ఆటగాడిని ఎంచుకునే విధానం

తుది టీంలో ప్రకటించిన ఆటగాడి స్థానంలో మ్యాచ్‌కు తగినట్లుగా ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంచుకోవచ్చు. ఒక వేళ చేజింగ్ సమయంలో బ్యాటర్ కావాలనుకుంటే, బౌలర్ స్థానంలో బ్యాటర్‌ను ఎంచుకోవచ్చు. బౌలింగ్ వేసే సమయంలో స్పిన్ బౌలర్ అవసం ఉంటే, బ్యాటర్ స్థానంలో బౌలర్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ఒక సారి ఇంపాక్ట్ ఆటగాడు గ్రౌండ్ వీడితే వీడిన ప్లేయర్ మళ్లీ మ్యాచులో ఆడే అవకాశం ఉండదు.

IPL కొత్త నియమాలు 2023 (IPL new rules 2023) గురించి మీరు ఈ కథనం నుంచి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా! మీకు పూర్తి IPL సమాచారం కోసం Yolo247 బ్లాగ్ చూడండి. క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం ప్రముఖ ప్లాట్‌ఫాం Yolo247 సందర్శించండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి