క్రికెట్‌లో నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు ?

నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) అని అందరికీ ఒక సందేహం ఉంటుంది. అయితే, క్రికెట్ ఆటలో ప్రతి పరుగు ముఖ్యమైనదే. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ మరియు ఐపిఎల్ వంటి ప్రముఖ లీగ్స్‌లో జట్ల విజయాలు సమానంగా ఉన్పప్పుడు, నెట్ రన్ రేట్ మీదనే తదుపరి రౌండ్ క్వాలిఫైయింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి, నెట్ రన్ రేట్  అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారనే విషయాల గురించి మనం తెలుసుకుందాం.

నెట్ రన్ రేట్ ఫార్ములా – వివిధ రకాలు

నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) అనేది ఒక్కో సారి ఒక్కో విధంగా ఉంటుంది. అంటే, ఫార్ములా ఒకటే అయినా టోర్నెమెంటు, మ్యాచ్‌ను బట్టి ఉంటుంది. ఇందులో సాధారణంగా జరిగే క్రికెట్ మ్యాచ్, A మరియు B జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లో B జట్టు 50 ఓవర్ల లోపు ఔట్ అయితే లెక్కింపు వేరేలా ఉంటుంది. అలాగే, టోర్నమెంట్లలో జట్ల విజయాలు సమానంగా ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ (NRR) లెక్కిస్తారు. వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయ్యే సమయంలో, వేరే ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయినా నెట్ రన్ రేట్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ విధంగా, నెట్ రన్ రేట్ (NRR) అనేది అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పరిగణలోకి తీసుకుంటారు. అయితే, దీనిపై పూర్తి స్థాయి విశ్లేషణ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

నెట్ రన్ రేట్ ఎలా లెక్కించాలి – విశ్లేషణ

నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) విషయానికి వస్తే, ఒక సాధారణ వన్డే మ్యాచ్‌లో రెండు జట్ల రన్ రేట్ల మధ్య వ్యత్యాసం మీద ఉంటుంది. ఇందులో గెలిచిన టీంకు ధనాత్మక విలువలు వస్తే, ఓడిపోయిన జట్టుకు రుణాత్మక విలువలు వస్తాయి. దీనికి సంబంధించి ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.

నెట్ రన్ రేట్ ఫార్ములా – ఉదాహరణ

నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) అనేది ఇప్పడు ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. A మరియు B అనే రెండు జట్లు ఒక వన్డే మ్యాచ్ ఆడతాయి. A జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. అలాగే, B జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది.

A రన్ రేట్= [మొత్తం స్కోర్/ఆడిన ఓవర్స్] = 365/50 = 7.3

B యొక్క రన్ రేట్ = [మొత్తం స్కోర్/ఆడిన ఓవర్స్] = 330/50 = 6.6

మ్యాచ్ ముగిసిన తర్వాత A నెట్ రన్ రేట్ (NRR)

A రన్ రేట్ – B రన్ రేట్ = 7.3 – 6.6 = +0.7

మ్యాచ్ ముగిసిన తర్వాత B నెట్ రన్ రేట్ (NRR)

B రన్ రేట్ – A రన్ రేట్ = 6.6 – 7.3 = -0.7

ఈ విధంగా, రెండు జట్ల యొక్క నెట్ రన్ రేట్ (NRR) లెక్కిస్తారు.

నెట్ రన్ రేట్ ఫార్ములా – టి20ల్లో ఎలా?

నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) సంబంధించి పైన చెప్పిన ఉదాహరణ వన్డే మ్యాచ్‌ల గురించి వివరిస్తుంది. అయితే, టి20ల్లో కూడా ఇదే ఫార్ములా ప్రకారం నెట్ రన్ రేట్ లెక్కిస్తారు. పైన చెప్పిన విధానం వన్డేకు సంబంధించినది కాబట్టి 50 ఓవర్ల పరంగా లెక్కింపు జరిగింది. టి20 అనేది 20 ఓవర్లకు సంబంధించినది. కావున ఇది 20 ఓవర్లలో లెక్కిస్తారు.


A రన్ రేట్ = [మొత్తం స్కోర్/ఆడిన ఓవర్స్] = 165/20 = 8.25

B యొక్క రన్ రేట్ = [మొత్తం స్కోర్/ఆడిన ఓవర్స్] = 140/20 = 7

మ్యాచ్ ముగిసిన తర్వాత A నెట్ రన్ రేట్

A రన్ రేట్ – B రన్ రేట్ = 8.25 – 7 = +1.25

మ్యాచ్ ముగిసిన తర్వాత B నెట్ రన్ రేట్

B రన్ రేట్ – A రన్ రేట్ = 7 – 8.25 = -1.25

అయితే, A లేదా B టీం 50 లేదా 20 ఓవర్ల కంటే తక్కువ ఆడి వికెట్లు మొత్తం కోల్పోతే, అప్పుడు వాళ్లు ఆడిన ఓవర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఏ టీం అయినా, ఎన్ని ఓవర్లు ఆడితే, వాటి ప్రకారం లెక్కిస్తారు.

వర్షం పడితే లేదా మ్యాచ్ రద్దైతే NRR ఎలా లెక్కిస్తారు?

 నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) : ఒక వేళ్ల వర్షం కారణంగా మ్యాచ్ ఓవర్లు కుదించబడినా, మ్యాచ్ పూర్తిగా రద్దైనా డక్ వర్త్ లూయిస్ (DLS) ప్రకారం నెట్ రన్ రేట్ లెక్కిస్తారు. ఉదాహరణకు, జట్టు A 50 ఓవర్స్‌లో 8 వికెట్స్ కోల్పోయి 225 రన్స్ చేసింది అనుకుందాం.. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన జట్టు B 25 ఓవర్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 125 రన్స్ చేసిన తర్వాత, వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం జట్టు Bకి 38 ఓవర్లలో 191 అని టార్గెట్ పెట్టారు.

ఇప్పుడు, ఇరు జట్ల యొక్క నెట్ రన్ రేట్ చెక్ చేద్దాం.

A యొక్క రన్ రేట్ = సవరించిన టార్గెట్/సవరించిన ఓవర్స్ = 190/38 = 5

B యొక్క రన్ రేట్ = చేసిన పరుగులు/ఓవర్స్ = 191/35 = 5.45

A యొక్క నెట్ రన్ రేట్ = 5 – 5.45 = –0.45

B యొక్క నెట్ రన్ రేట్ = 5.45 – 5 = +0.45

టోర్నమెంట్‌లో నెట్ రన్ రేట్ ఎలా లెక్కించాలి?

 టోర్నమెంటులో నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) అనేది ఒక్క మ్యాచ్‌ను బట్టి ఉండదు. అప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల యొక్క గెలుపు, ఓటములను పరిగణలోకి తీసుకుని జట్టు యొక్క మొత్తం నెట్ రన్ రేట్ లెక్కిస్తారు. మళ్లీ నెట్ రన్ రేట్ అనేది మ్యాచ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఇందులో జట్టు మొత్తం స్కోర్ చేసిన పరుగులు, జట్టు మీద చేసిన పరుగులు, మొత్తం ఆడిన ఓవర్స్ తీసుకుంటారు. 

చివరగా, నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (how to calculate net run rate) సంబంధించి పూర్తి అవగాహన ఈ బ్లాగ్ చదవడం ద్వారా వచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని క్రికెట్ విషయాలు, చిట్కాల కోసం ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి.

మరింత సమాచారం కావాలంటే క్రికెట్‌లో ఔట్స్ రకాలు – సమగ్ర విశ్లేషణ బ్లాగ్ చదివి తెలుసుకోండి.

నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు (How To Calculate Net Run Rate) – FAQs

1. నెట్ రన్ రేట్‌లో ఓవర్లను ఎలా పరిగణిస్తారు?

A. వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఉంటే, ఏదైనా టీం మొత్తం ఓవర్స్ ఆడితే 50 ఓవర్లు లెక్కిస్తారు. అయితే, 42 ఓవర్లలో అందరూ ఔట్ అయితే, 42 ఓవర్ల వరకు మాత్రమే లెక్కిస్తారు.

2. వన్డేలు, టి20ల్లో నెట్ రన్ రేట్ ఫార్ములా ఒకేలా ఉంటుందా?

A. అవును, నెట్ రన్ రేట్ ఫార్ములా వన్డేలు, టి20ల్లో ఒకేలా ఉంటుంది. అయితే, వన్డేల్లో గరిష్టంగా 50 ఓవర్లు ఉంటే, టి20ల్లో 20 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఓవర్స్ మాత్రమే వేరేలా ఉంటుయి, ఫార్ములా ఒకేలా ఉంటుంది.


Please rate the Article
Rating 0

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి